ఆయిల్ మాఫియా స్థావరాలపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. తుని నేషనల్ హైవేపై అక్రమంగా ఆయిల్ మాఫియా సాగిస్తున్న స్థావరాలపై తుని రూరల్ ఎస్సై బి కృష్ణమాచార్యలు తన సిబ్బందితో దాడి చేసి స్థావరాలను ధ్వంసం చేశారు. ఇకపై ఇటువంటి అక్రమ ఆయిల్ మాఫియా, అసాంఘిక కార్యక్రమాలు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.