రైతులకు ఎటువంటి భూసమస్యలు లేకుండా చేయడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. తూని మండలం వల్లూరు గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొన్నారు. రైతుల నుంచి అర్జీలను స్వీకరించారు. సమస్యను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆమె తెలిపారు. మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు, యనమల రాజేష్ పాల్గొన్నారు