కృష్ణా జిల్లా మోపిదేవి మండలం పెదకళ్లేపల్లి గ్రామంలో ఆక్వా రైతులను వరద నిండునా ముంచేసింది. ఆక్వా జోన్ గా ప్రకటించకపోవటంతో ప్రభుత్వ రాయితీలు రాక విద్యుత్ చార్జీలలో మినహాయింపు రాకపోవడం ఇవన్నీ తట్టుకున్నా ఆక్వా రైతులు రూ. 5 కోట్ల రూపాయల రొయ్యలు సముద్రం పాలు అయ్యాయని శుక్రవారం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని కోడూరులో కూడా ఆక్వా రైతులు నష్టపోయినట్టు తెలిపారు.