కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినట్టు సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు గొల్లు కృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం అవనిగడ్డలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి పాలన ప్రారంభమై నాలుగు నెలలైనా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.