మోపిదేవి మండలం నాగాయతిప్ప గ్రామ సచివాలయంలో ఫర్నీచర్ మాయంపై ఈవోపీఆర్డీ అశోక్ కుమార్ శనివారం విచారణ చేపట్టారు. సచివాలయాన్ని పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రెండు ఇనుప బీరువాలు మరమ్మతుల నిమిత్తం పంచాయతీ అనుమతి లేకుండా సచివాలయం సెక్రటరీ తరలించినట్లు ఆరోపణలు వచ్చాయన్నారు. విచారణ చేసి నివేదికను పైఅధికారులకు పంపనున్నట్లు తెలిపారు.