దోమల నివారణా చర్యల్లో భాగంగా మోపిదేవి మండలం పెదప్రోలు గ్రామ పంచాయతీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెదకళ్లేపల్లి ఆధ్వర్యంలో శనివారం గ్రామంలో (దోమల నివారణకు పొగ మందు) ఫాగింగ్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పొలిమెట్ల ఏసుబాబు, పంచాయతీ కార్యదర్శి రామకోటేశ్వర రావు, జూనియర్ అసిస్టెంట్ సాంబశివరావు పాల్గొన్నారు.