గ్రాడ్యుయేట్లు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్సీ ఓట్లు నమోదు చేయించుకోవాలని గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ కోరారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఓట్ల నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. తన ఓటు నమోదు దరఖాస్తును నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓట్ల నమోదు పరిశీలకులు రావి సూర్య కిరణ్ తేజకు అందచేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.