జాతిపిత మహత్మాగాంధీ సమాధిని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సందర్శించారు. దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ఆదివారం మధ్యాహ్నం న్యూఢిల్లీలోని రాజ్ ఘాట్ లో ఉన్న మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. తన శాంతియుత పోరాటంతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహాత్మాగాంధీ అనుసరించిన సత్యం, అహింస విధానాలు ప్రపంచానికి మార్గదర్శకాలుగా నిలిచాయన్నారు.