మోపిదేవి మండల పరిధిలోని మోపిదేవి, పెదకళ్లేపల్లి, పెదప్రోలుతో పాటు పలు గ్రామ పంచాయతీలకు స్వచ్ఛ సంకల్పంలో భాగంగా తడి చెత్త, పొడి చెత్తను సేకరించడానికి ప్రభుత్వం మూడు చక్రాల రిక్షాలను పంచాయతీలకు కేటాయించింది. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా అవి నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటికి మరమ్మతులు చేసి వినియోగంలోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.