కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు ఆపాలి

52చూసినవారు
కూటమి ప్రభుత్వం అసత్య ఆరోపణలు ఆపాలి
కూటమి ప్రభుత్వం అసత్యాలను ప్రచారం చేయడం ఆపాలని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తెలిపారు. శనివారం మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసిపి ప్రభుత్వంపై బురదజల్లేందుకు కూటమి నేతలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. తిరుపతి లడ్డు అపవిత్రత జరిగితే విచారణ చేపట్టాలని, ఇలా రాద్ధాంతం చేయడం తగదన్నారు.

సంబంధిత పోస్ట్