వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రామ్ అన్నారు. బుధవారం నాగాయలంక మండలంలో ఈలచెట్లదిబ్బ, నాచుగుంట, ఏసుపురం, కృష్ణాపురం, ఎదురుమొండి గ్రామాల్లో వెంకట్రామ్, అధికారులు, నిత్యానంద్, ఎం. హరనాథ్ బాబులతో విస్తృతంగా పర్యటించారు. వరద ముంపు నుంచి తేరుకుంటున్న నివాసిత కుటుంబాల వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.