డాక్టర్ కోట శ్రీహరి హత్య కేసు విచారణ సీబీసీఐడీకి అప్పగించటం ద్వారా ఇప్పటికైనా దోషులకు శిక్ష పడుతుందనే విశ్వాసం లభించిందని డాక్టర్ శ్రీహరి తనయుడు డాక్టర్ కోట ప్రవీణ్ అన్నారు. బుధవారం సాయంత్రం అవనిగడ్డలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాదును డాక్టర్ కోట శ్రీహరి కుమారుడు డాక్టర్ కోట ప్రవీణ్, సోదరుడు కోట శ్రీధర్ రావు, బావమరిది బచ్చు వెంకటనాధ్ తదితరులు కలిసి ఎమ్మెల్యేను సత్కరించారు.