వరదల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే..మాజీ సీఎం జగన్ ప్రజలకు సాయం చేయకపోగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొల్లు రవీంద్ర జగన్ తీరు పై మండిపడ్డారు. గన్నవరం నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాలయిన జక్కులనెక్కలం, ముస్తాబాద, సావారిగూడెం ప్రాంతాల్లో గురువారం మంత్రి కొల్లు రవీంద్ర గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి విస్తృతంగా పర్యటించారు.