మండలంలోని మద్దూరులో ఈతకు వెళ్లి విద్యార్థి మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లిన ఆరుగురు యువకులలో కార్తీక్ (13) ప్రమాదవశాత్తు నదిలో మునిగి మృతిచెందాడు. సెలవులకు వచ్చి కానరాని లోకానికి తనయుడు వెళ్లడంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.