గుడివాడ: పట్టపగలే కోడి పందాలు

66చూసినవారు
గుడివాడలోని బైపాస్ రోడ్డులో శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం భూముల్లో ఆదివారం పట్టపగలు కోడి పందాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున పందెం రాయుళ్లతో జరుగుతున్న కోడిపందాల శిబిరాలపై గుడివాడ రూరల్ మండలం పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. దాడుల్లో 23 బైక్ లు, 2 ఆటోలు, 2 కోళ్లు, కోడి కత్తులు సీజ్ చేశారు. నలుగురు నేతలను  అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్