గుడివాడ నియోజకవర్గంలో ముందస్తు సంక్రాంతి కోడి పందాలపై పోలీసుల దాడులు చేయటంతో గుడివాడ టిడిపి నాయకులు షాక్ కు గురయ్యారు. ఆదివారం బైపాస్ రోడ్డులో శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం భూముల్లో పకోడి పందాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున పందెం రాయుళ్లతో జరుగుతున్న కోడి పందాల శిబిరాలపై గుడివాడ రూరల్ మండలం పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.