గుడివాడ పట్టణ టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో 78వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు గురువారం పండగ వాతావరణంలో ఘనంగా జరిగాయి.
ఎమ్మెల్యే వెనిగండ్ల ఎన్డీఏకుటమీ పార్టీల నాయకులతో కలిసి ఎంపీ వల్లభనేని బాలసౌరి జాతీయ పతాకాన్ని ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు జాతీయగీతం ఆలపిస్తూ పతాక వందనం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.