గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో స్పై కెమెరాలు గుర్తించలేదని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై దర్యాప్తు గురించి ఆయన గురువారం వివరించారు. సీఎం ఆదేశాల మేరకు నిష్పక్షపాతంగా విచారణ జరిగిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల అనుమానాలు నివృత్తి చేశామన్నారు. తమ విచారణలో కెమెరాలు, గానీ, ఆరోపణల్లో వినిపిస్తున్న వీడియోలు గానీ ప్రత్యక్షంగా చూసినట్లు ఎవరూ చెప్పలేదన్నారు.