జగ్గయ్యపేట: ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట: ఎమ్మెల్యే

82చూసినవారు
ప్రజా సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని కృషి చేస్తామని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ అన్నారు. మంగళవారం జగ్గయ్యపేట మున్సిపల్ కమిషనర్ తో కలిసి పట్టణంలోని బొడ్రాయి బజార్, వెండి దేవాలయం వీధి, పాతపేట గడ్డ తదితర ప్రాంతాలను పరిశీలించారు. వార్డులలో ఉన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అద్దాల బజార్ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి నూతనంగా రోడ్డును ఏర్పాటు చేయాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్