స్కానింగ్ రూమ్ వద్ద గర్భిణీలు ఇబ్బందులు!

57చూసినవారు
స్కానింగ్ రూమ్ వద్ద గర్భిణీలు ఇబ్బందులు!
మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్కానింగ్ రూమ్ వద్ద రోగులు, గర్భిణీ స్త్రీలు శుక్రవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతినెల స్కానింగ్ కోసం గర్భిణీ మహిళలు స్కానింగ్ కోసం వచ్చి గంటల తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితి నెలకొంది. వైద్యులు స్కానింగ్ రాసిన తర్వాత తొందరగా చేయకపోవడంతో పదుల సంఖ్యలో ప్రజలు ఎదురుచూస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్కానింగ్ తీసే సిబ్బంది స్పందించడం లేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్