రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్

52చూసినవారు
రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలి: కలెక్టర్
జిల్లాలో పటిష్టమైన రోడ్డు భద్రత చర్యలు చేపట్టి, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశం శుక్రవారం మచిలీపట్నంలోని కలెక్టరేట్లో మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. రోడ్డు ప్రమాదాలకు అవకాశం గల బ్లాక్ స్పాట్స్ గుర్తించి, సంబంధిత శాఖల సంయుక్త తనిఖీలు నిర్వహించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు.

సంబంధిత పోస్ట్