వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని రవాణా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మచిలీపట్నంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మచిలీపట్నం ట్రాఫిక్ ఇన్స్ పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో పలువురు యువతీ, యువకులు ర్యాలీ నిర్వహించి వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించారు. అతివేగం ప్రమాదకరమని, ట్రాఫిక్ రూల్స్ ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా ధ్రువపత్రాలు కలిగి ఉండాలని తెలిపారు.