భూ సంబంధమైన సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు బందరు ఆర్డిఓ స్వాతి పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తాళ్లపాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పట్టాదారు పాసుపుస్తకాలలో మార్పులు, పొలం సరిహద్దులు, ఇతర సమస్యలన్నీటికి సదస్సులు చక్కటి వేదిక అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.