మచిలీపట్నం : ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు

65చూసినవారు
మచిలీపట్నం : ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు
జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. మచిలీపట్నంలోని కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం జరిగింది. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మతో కలిసి ఆయన జిల్లాలో ఉచిత ఇసుక విధానం అమలుపై అధికారులతో సమీక్షించారు. జిల్లాలో ఉచిత ఇసుక విధానం కచ్చితంగా అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్