మచిలీపట్నంలోని టీటీడీ కల్యాణ మండపం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యే ప్రజావేదిక వద్ద ఏర్పాటులను రాష్ట్ర మంత్రులు నారాయణ కొల్లు రవీంద్ర పరిశీలించారు. బుధవారం సభా ప్రాంగణం వద్దకు విచ్చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు వేదిక వద్ద ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసే ప్రాంతాన్ని, స్వచ్ఛత కార్యక్రమాలు ప్రారంభించే ప్రాంతాన్ని వారు పరిశీలించారు.