ఫిషర్ మెన్ కో - ఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్ ఇంట్లో చోరీకి పాల్పడిన ఘటన బంటుమిల్లి మండలం అర్తమూరులో చోటుచేసుకుంది. బాధితుడు ఇజ్రాయెల్ వివరాల మేరకు బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు ఇంటి తాళం పగులగొట్టి రెండు బీరువాల్లోని ఫిషర్ మాన్ సొసైటీకి సంబంధించిన రికార్డులు, డాక్యుమెంట్లు ఖరీదైన వస్త్రాలు చోరీ చేశారు. గురువారం బంటుమిల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.