పెడన నియోజకవర్గంలోని బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి డ్రైన్ తవ్వకాల పనులను పెడన నియోజకవర్గ శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని పెద్ద తుమ్మిడి డ్రైన్ తవ్వకాల పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టినట్లు తెలిపారు.