కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు ఆదేశాల మేరకు పెడన పట్టణంలోని పలువురు విద్యార్థులకు మహిళలకు అవగాహన కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శక్తి టీం పలు కళాశాలలను సందర్శించి మహిళా చట్టాలపై అవగాహన కల్పించారు. పట్టణ ఎస్ఐ-2 రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు శక్తి టీం సభ్యులు తెలిపారు. అత్యవసర సమయాల్లో పోలీసులకు సమాచారం అందించాలన్నారు.