కంకిపాడు మండలంలోని తెన్నేరులో వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం పెనమలూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులను కలిసి ఏర్పాట్లు గురించి బోడే అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో అనూష, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త ముప్పా రాజా, మండల టీడీపీ అధ్యక్షుడు సుదిమళ్ళ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.