ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించి ప్రాణాలను కాపాడుకోవాలని పెనమలూరు సర్కిల్ ఇన్ స్పెక్టర్ వెంకట నారాయణ తెలిపారు. గురువారం తాడిగడప జంక్షన్లో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు కాపాడుకోవడమే కాకుండా తమ కుటుంబాలకు రక్షణ కల్పించడం జరుగుతుందని అందువల్లే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు.