విస్సన్నపేటలో శ్రీ మారెమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆలయలో ఈ 24న టెండర్ల ప్రక్రియకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి దుర్గా ధన ప్రసాద్ తెలిపారు. 4, 5, 6, 7, 8, 9 షాపు నందు సుగంధాది పరిమళాలు వెదజల్లే పూజా ద్రవ్యాలు అమ్ముకునేందుకు, అమ్మవారి పాదాల చెంత భక్తులు మొక్కులు తీర్చుకునే తలనీలాలు కొబ్బరి చిప్పలు, వస్త్రాలు, పోగు చేసుకునేందుకు హక్కును పొందేందుకు ఈవో కార్యాలయంలో సంప్రదించవలసినదిగా కోరారు.