విసన్నపేట మండలం చండ్రుపట్ల తండాలో నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల మంగళవారం దాడులు చేశారు.
భూమిలో నిల్వచేసిన 20 డ్రమ్ముల్లోని 2వేల లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాటుసారా తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతుందని అన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సీఐ జె శ్రీనివాస్ హెచ్చరించారు.