తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి వారిని శాసన సభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు మంగళవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు, ఎండోమెంట్స్ శాఖ అధికారులు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే తో పాటు కూటమి పార్టీ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.