తిరువూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని విసన్నపేట మండలంలో నాటు సారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ శాఖ అధికారులు మంగళవారం దాడులు చేశారు. వేమిరెడ్డిపల్లి తండాలో నాటుసారా స్థావరాలపై దాడులు చేసి ఐదు లీటర్లు నాటు సారా స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. తాతగుంట్ల తండాలో 530 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం చేసినట్లుగా ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.