ఆకుకూర వ్యాపారితో తిరువూరు ఎమ్మెల్యే మాటామంతి

71చూసినవారు
ఆకుకూర వ్యాపారితో తిరువూరు ఎమ్మెల్యే మాటామంతి
తిరువూరులో ఆకుకూరలు అమ్ముకునే వ్యాపారి సాధక బాధలను ఎమ్మెల్యే శ్రీనివాసరావు మంగళవారం అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే నివాసం వద్ద తారస పడిన వ్యాపారిని ఏ ఊరు, ఎలా ఉన్నారు, కుటుంబ పోషణ ఎలా గడుస్తుంది, ఎక్కడి నుండి ఆకుకూరలు తెస్తున్నావు అంటూ ఎమ్మెల్యే ఆరా తీశారు. 5 ఎకరాలు కౌలుకు తీసుకుని ఆర్గానిక్ పంటలైన ఆకుకూరలు, కూరగాయల పండించాలని ఉందని త్వరలో మీ ఊరు వస్తానని వ్యాపారితో ఎమ్మెల్యే ముచ్చటించారు.

సంబంధిత పోస్ట్