బెజవాడ గజగజ...వైరల్ అవుతున్న డ్రోన్ విజువల్స్

75చూసినవారు
వరుణుడి దెబ్బకు బెజవాడ గజగజ వణుకుతోంది. పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరి పేట వరదలో మునిగింది. దీనికి సంబంధించిన డ్రోన్ విజువల్స్ ఆదివారం వైరలవుతున్నాయి. అదేవిధంగా వాగుల ఉద్ధృతి పెరగడంతో పరిసర గ్రామాల్లోని ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు. వాగులు, వంకలు పొంగిపొర్లటంతో పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

సంబంధిత పోస్ట్