ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ను ఏసిఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని), విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తో వీక్షించారు. మంత్రి నారా లోకేష్, విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) టీమిండియా జెర్సీ లు వేసుకుని మ్యాచ్ ను తిలకించారు.