గుంటూరు జిల్లా పెదకాకాని విద్యుదాఘాతం ఘటనపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన నలుగురు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రతో పాటు స్థానిక అధికారులతో కూడా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ మేరకు మంత్రి గొట్టిపాటి రవి హామీ ఇచ్చారు.