చల్లపల్లి: పేదలకు ఉచిత ఇసుక అందుబాటులోకి తేవాలి

55చూసినవారు
చల్లపల్లి: పేదలకు ఉచిత ఇసుక అందుబాటులోకి తేవాలి
పేదలకు, గృహ నిర్మాణదారులకు చల్లపల్లి మండలంలో ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని అవనిగడ్డ నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు కోరారు. చల్లపల్లి తహసీల్దార్ డి. వనజాక్షిని బుధవారం కలిసిన ఆయన చల్లపల్లి మండలంలో ఇసుక లభ్యతపై చర్చించారు. వెలివోలులో ఇసుక రీచ్ ను ప్రారంభించి ఉచిత ఇసుకను ప్రజలకు అందేలా చూడాలన్నారు. వెలివోలు పరిధిలో క్వారీ నిర్వహించటంతో ఎంతో మందికి ఉపాధి కలుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్