నేడు ప్రపంచం అనేక సంక్షోభాల తో కొట్టుమిట్టాడుతున్నది. శాంతి నెలకొల్పాలంటే ధార్మిక పరంగా నే సాధ్యమవుతుందని కుల మతాలకతీతంగా ప్రపంచ శాంతిని నెలకొల్పేందుకు అందరూ కృషి చేయాలని అంతర్జాతీయ అహ్మదియ్యముస్లిం కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి సజీల్ గోరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా పర్యటిస్తూ 25 వ తేదీన కృష్ణాజిల్లా రావడం జరిగింది. జిల్లాలోని అనేక ప్రముఖులను కలిసి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఐదవ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ ప్రపంచ సంక్షోభం మరియు శాంతి మార్గం అనే పుస్తకాన్ని శనివారం బహుకరించడం జరిగింది. ఇస్లాం యొక్క శాంతి బోధనల గురించి సమగ్ర సమాచారాన్ని అందజేసి అందరినీ ప్రేమించు ఎవరిని ద్వేషించకు అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ చేస్తున్న సేవలను వివరించారు. ఈ సందర్భంగా వారితో పాటు కృష్ణా జిల్లా యూత్ అధ్యక్షులు షేక్ బాపూజీ, గురువులు మహమ్మద్ యాకూబ్ పాషా, బదర్ ఆధ్యాత్మిక తెలుగు వార పత్రిక ఇన్ స్పెక్టర్ మొహమ్మద్ జావిద్ అహ్మద్ పాల్గొన్నారు.