చల్లపల్లి మండల పరిధిలోని నిమ్మగడ్డలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న కేసులో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు చల్లపల్లి సీఐ తెలిపారు. సోమవారం చల్లపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిమ్మగడ్డలో అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందని రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళగా ఆక్రమణదారులు వారిని అడ్డుకున్నారన్నారు. వెంటనే పోలీసులు వెళ్ళగా వారిని కూడా అడ్డుకోవడంతో ముగ్గురిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు.