చల్లపల్లి మండలంలో ఇసుక అక్రమ తరలింపును ఎస్ఐ పి. సుబ్రహ్మణ్యం అడ్డుకున్నారు. గురువారం పోలీసులకు వచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించారు. నడకుదురు రేవులో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఏడు ఇసుక ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాటిని చల్లపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇసుక రవాణాదారులపై కేసులు నమోదు చేశారు.