కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని టిడిపి పార్టీ నాయకులు బేతాళ మాణిక్యరావు, కొండేటి నాగరాజు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం గన్నవరం నియోజకవర్గం పరిధిలోని బాపులపాడు మండలం బండారుగూడెం గ్రామంలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన సందర్శంగా ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ విధానాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.