నూతన సంవత్సర కానుకగా కూటమి ప్రభుత్వం ఒక్క రోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీకి శ్రీకారం చుట్టిందని గన్నవరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల వద్దకే పాలనను తీసుకువచ్చారని ఇందులో ప్రజాప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసారని అన్నారు. మంగళవారం గన్నవరం మండలంలోని దావాజిగూడెం హరిజనవాడ ప్రాంతాలలో ఇంటిఇంటికి వెళ్లి పంపిణీ చేశారు.