ప్రజా సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం గన్నవరం క్యాంప్ కార్యాలయంలో ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సమస్యలకు అప్పటికప్పుడు పరిష్కారం చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ పరమావధి అన్నారు.