గుడివాడలోని ద్రోణాదుల కాలనీకి చెందిన చల్లా వెంకటేశ్వరరావు (71) అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యాడు. గురువారం ఆయన సిగరెట్ వెలిగించి నిద్రలోకి జారుకోగా సిగరెట్ నిప్పు ఆయన పడుకున్న మంచానికి అంటుకుంది. దీంతో మంటలు వ్యాపించి తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన భార్య సావిత్రీ బయటకు వెళ్లి వచ్చేలోగా మంటల్లో కాలిపోతున్న భర్తను చూసి కంగారు పడింది. స్థానికుల సహాయంతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు.