గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావుపై ఎస్సీ, ఎస్టీ, అత్యాచారాల నిరోధక చట్టం కింద పెట్టిన కేసు కొట్టి వేస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి ఎస్. చినబాబు గురువారం తీర్పు చెప్పారు. 2020 నవంబరు 7న గుడివాడ నియోజకవర్గ పరిధిలోని మల్లయ్యపాలెం టిడ్కో ఇళ్ల వద్ద పనిచేస్తున్న ఉద్యోగులను అడ్డగించారని, కులం పేరుతో దూపించారన్న ఫిర్యాదుపై రావితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేశారు.