గుడివాడ: వైసిపి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా వర్ధంతి

58చూసినవారు
గుడివాడ: వైసిపి ఆధ్వర్యంలో వంగవీటి మోహన రంగా వర్ధంతి
గుడివాడ వైసిపి ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి కార్యక్రమాలు గురువారం వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావు కార్యాలయంలో జరిగాయి. ఈ సందర్భంగా హనుమంతరావు తదితర నేతలు రంగ చిత్రపటానికి పూల మాలలతో నివాళులర్పించి జోహార్ వంగవీటి మోహనరంగా అంటూ నినాదాలు చేశారు. అనంతరం మండలి మాట్లాడుతూ రంగా మరణానికి కారణమైన వ్యక్తులు ఓట్ల కోసం నేడు ఆయన విగ్రహానికి దండలు వేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్