బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలబడి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన పెదవర్గాల ఆదర్శనాయకుడు రంగా అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి సందర్భంగా గురువారం ఏజీకే స్కూల్ సెంటర్ లో ని రంగా విగ్రహానికి ఎమ్మెల్యే రాము, కూటమి నాయకులు పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జోహార్రం గా అంటూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.