మిత్రుడు నామినేషన్ ర్యాలీలో పాల్గొన్న కేశినేని శివనాథ్

35572చూసినవారు
మిత్రుడు నామినేషన్  ర్యాలీలో పాల్గొన్న కేశినేని శివనాథ్
అన్న నందమూరి తారక రామారావు స్పూర్తితో గుడివాడలో దుర్మార్గాన్ని ఎదిరించి ప్ర‌జ‌ల‌కు అండ‌గా నిల‌బ‌డుతున్న‌ వెనిగండ్ల రాముకి అన్నివ‌ర్గాల నుంచి సంపూర్ణ మ‌ద్ద‌తు వుంది. గుడివాడలో కోడాలి నానికి డిపాజిట్లు కూడా రావ‌ని, టిడిపి ఎమ్మెల్యే అభ్య‌ర్ధి వెనిగండ్ల రాము భారీ మెజార్టీతో గెల‌వ‌బోతున్నాడ‌ని వెనిగండ్ల రాము మిత్రుడు, బిజెపి, జ‌న‌సేన బ‌ల‌ప‌రిచిన టిడిపి విజ‌య‌వాడ పార్లమెంట్ అభ్య‌ర్ధి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) అన్నారు. మంగ‌ళ‌వారం గుడివాడ‌లో జ‌రిగిన వెనిగండ్ల రాము నామినేష‌న్ కార్య‌క్ర‌మంలో కేశినేని శివ‌నాథ్ ముఖ్యఅతిథిగా త‌న త‌న‌యుడు కేశినేని వెంక‌ట్ తో క‌లిసి పాల్గొన్నారు. ముందుగా మిత్రుడు వెనిగండ్ల రామును ఆయన‌ నివాసంలో క‌లిసి కేశినేని శివ‌నాథ్ అభినంద‌న‌లు తెలియ‌జేశారు. అనంత‌రం వెనిగండ్ల ఇంటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వ‌ర‌కు జ‌రిగిన పాద‌యాత్ర‌లో రాముతో క‌లిసి పాల్గొన్నారు. ఆ త‌ర్వాత పార్టీ ఆఫీస్ నుంచి ఎన్నిక‌ల ప్రచారం ర‌థం ఎక్కి వేలాది మంది కార్య‌క‌ర్త‌ల‌తో ర్యాలీ గా నామినేష‌న్ దాఖ‌లు చేయ‌టానికి బ‌య‌లుదేరారు. ఈ ర్యాలీలో ఎన్నిక‌ల ప్ర‌చార ర‌థం పై వెనిగండ్ల రాము తో క‌లిసి కొంత దూరం కేశినేని శివ‌నాథ్ పాల్గొన్నారు. కేశినేని శివనాథ్ ప్రజలకు అభివాదం చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు..

ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ గుడివాడ ప్ర‌జ‌లు ఈ చోట సైకో పాల‌నతో విసిగెత్తిపోయార‌ని.మంత్రి గా వుండి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్దికి ఒక‌రాయి కూడా వేయని కొడాలి నానికి డిపాజిట్లు కూడా రాకుండా ఓడించేందుకు ప్ర‌జ‌లు సిద్దంగా వున్నార‌న్నారు. కొడాలి నాని వాడే భాష‌, ప్ర‌వ‌ర్త‌న‌, వ్య‌వ‌హార‌శైలి చూసి జ‌నాలు విసిగెత్తిపోయారు. రాము నిత్యం ప్ర‌జ‌లకు అందుబాటులో వుండటం, వారితో మాట్లాడే తీరు, వ్య‌హారించే విధానం ప్ర‌జ‌ల‌కు బాగా న‌చ్చుతుందన్నారు. అంతే కాకుండా అన్న నంద‌మూరి తార‌క‌రామారావు గుడివాడ‌లో పోటీ చేసిన‌ప్పుడు ఖాకీ ద‌స్తులు వేసి ప్ర‌చారం చేశారు. ఆయ‌న్ను గుర్తు చేసుకుంటూ వెనిగండ్ల రాము ఖాకీ దుస్తులు వేసుకోవ‌టం తెలుగుదేశం కార్య‌క‌ర్త‌ల‌కు మ‌రింత ఉత్సాహం ఇచ్చింద‌న్నారు. గుడివాడ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లు ఎన్డీయే కూట‌మి అభ్య‌ర్ధిగా వెనిగండ్ల రాముని గెలిపించుకోవాల‌ని అతృత‌తో ఎదురుచూస్తున్నార‌ని తెలిపారు.

ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జనసేన ఇన్‌చార్జ్‌ బూరగడ్డ శ్రీకాంత్‌, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ యలవర్తి శ్రీనివాసరావు, జ‌గ‌న్ మోహ‌న్ రావుల‌తో పాటు వేలాది మంది బిజెపి, టిడిపి, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్